అడివి శేష్ పేరును సూచించిన సమంత!

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'బేబీ'
  • ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ
  • కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్        
విభిన్నమైన కథాంశాలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ అడివి శేష్ ముందుకు సాగుతున్నాడు. 'క్షణం' .. 'గూఢచారి' సినిమాలు ఆయనకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆయన హీరోగా చేస్తోన్న ఒకటి రెండు సినిమాలు సెట్స్ పై వున్నాయి. అలాంటి అడివి శేష్ ఒక సినిమాలో అతిథి పాత్రలో కనిపించడానికి అంగీకరించడం విశేషం.

సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'బేబీ' సినిమా రూపొందుతోంది. ఓ కొరియన్ మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన రోల్ వుందట. ఈ పాత్ర అడివి శేష్ చేస్తే బాగుంటుందని సమంత సూచించడంతో, నందిని రెడ్డి ఆయనను తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి 'బేబీ'లో అడివి శేష్ కూడా జాయిన్ అయ్యాడన్న మాట. 
Go Back to Shorts
samanta
lakshmi
rajendra prasad

More Telugu News